|
The Untold Story of Sita book Telugu Brahmavidwanmani Saroja Gullapalli
Episode-17 (సీతాయణం లోని విలువలు)
1) సీతమ్మ తల్లి ప్రోద్బలంతో జనక మహారాజు ఆడపిల్లలకి గురుకులం నెలకొల్పారు అనే విషయం. మరియు రామాయణం లో ఎందరో యోగులు మునుల పేర్లు తెలుసు కానీ వారి భార్యలైన అరుంధతి మాత, అనసూయ మాత, ఖ్యాతి అమ్మ, లోపాముద్ర దేవి, అహల్య దేవి, ముఖ్యంగా సీతమ్మ తల్లి గొప్పతనం గురించి వారి శక్తి సామర్థ్యాల గురించి సీతా యనంలో తెలుసుకోవచ్చు.
2) ప్రకృతి పట్ల మన బాధ్యత అన్ని జీవరాశుల పై కరుణ పిల్లలని ప్రకృతికి దగ్గరగా పెంచడం ఎంతో విలువైన జ్ఞానం.
3) అనంతమైన షరతులు లేని ప్రేమ సీతమ్మ తల్లి రావణాసురుని పై కూడా కరుణతో మంచి మార్గంలోకి తేవాలని ప్రయత్నించడం. ఎంతటి క్లిష్టమైన పరిస్థితులను కలిగించిన వారినైనా అర్థం చేసుకొని ప్రతి పరిస్థితికి సమర్పించుకొని ముందుకు సాగటం.
4) సీతాయనం లో ముఖ్యంగా కాలచక్రం గురించి తెలుసుకున్న తర్వాత మన జీవితంలో వచ్చే పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతాము.
5) సీతాయనం ద్వారా అద్భుతమైన విలువలను అందించిన దీన మెరయన్ గారికి మరియు తెలుగులో వివరించిన సరోజ మేడమ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. |